KJSS Giving Scholarship for 2023

కమ్మ జన సేవా సమితికి స్వాగతం

 

 

రాష్ట్రంలోనే విద్యకు ప్రధమ స్థానంలో ఉన్న గుంటూరు నందుబాలుర వసతి గృహము 1919 సంవత్సరము నుండి పెద్దలు,దాతల సహాయంతో పనిచేయుచున్నది. ప్రస్తుతం అరండల్ పేటలో ఉన్న ఈ హాస్టలులో చదువుకొని ఎంతోమందిఉన్నత స్థితికి చేరుకొన్నారు.readmore 

         

                 

                   భవిష్యత్తు కార్యక్రమాలు

1. రూ. 10 లక్షల ఖర్చుతో సీనియర్ బ్లాక్ పైభాగంలో 18 కె.వి.ఎ. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు నిర్ణయించడమైనది.

2. తల్లిదండ్రులు వసతి గృహాన్ని సందర్శించినపుడు వారు కూర్చోడానికి వీలుగా ఒక గదిని నిర్మాణం చేయుటకు నిర్ణయించడమైనది.

3. ఫైర్ సేఫ్టీ విషయంలో నిర్ణయం తీసుకొని ఫైర్ సేఫ్టీ పైప్ లైన్లు, ఫైర్ సేఫ్టీ సిలండర్లు ఏర్పాటు చేసి వాటి వాడకము గురించి సిబ్బందికి విద్యార్థినులకు అవగాహన కల్పించాలని నిర్ణయించి అమలు కొరకు అడుగులు వేయటమైనది.

4. భవన సముదాయానికి గత 6 సం॥ల నుండి పెయింటింగ్ వేయనందువలన బిల్డింగ్ అవుట్సైడ్ అన్నివైపులా పెయింటింగ్ వేయించుటకు నిర్ణయించటమైనది.

5. భవిష్యత్తులో అనాధ పిల్లలకు, తల్లిదండ్రులు ఒక్కరు లేనివారికైనా వసతి గృహంలో ఫీజు పూర్తిగా మాఫీ చేయడం గాని లేదా సగం ఫీజు కట్టించుకొనుట గాని విద్యార్థినుల ఆర్థిక స్థితులను బట్టి ప్రవేశం కల్పించుటకు నిర్ణయించటమైనది.

     

Latest News 

26-2-2023. 21 వ వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీ నూతక్కి రామక్రిష్ణ ప్రసాద్ దంపతులు విద్యార్థినులు నూతన ఆవిష్కరణకు నాంది పలకాలని, విద్యతో పాటు జీవితపు విలువలు తెలుసుకోవాలని కోరుతూ కులమతాలకు అతీతంగా ఇంటర్ మరియు పాలిటెక్నిక్ చదువుతున్న 200 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున ఉపకారవేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

8-3-2023న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కులమతాలకు అతీతంగా 73 మంది విద్యార్థినులకు డా॥ పాతూరి రాధిక, కె. ప్రసన్న చేతుల మీదుగా ఉపకార వేతనాలు అందజేయడమైనది.

4వ సంవత్సరం బి.టెక్ చదువుతున్న విద్యార్థినులకు సంస్థ తరఫున హైదరాబాద్ వండర్ లా విహారయాత్రకు పంపడమైనది.

 

Kjss Programs

1. పల్నాటి శతకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం nri’s ద్వారా నిర్వహించబడింది .  2.చేతన ఫౌండేషన్ USA పేద మరియుపేద మహిళలకు కుట్టు మిషన్లు మరియు పుష్కరాల పంపిణీ .

3.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బృందావన్ గార్డెన్స్ బ్రాంచ్) గుంటూరు ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం హాస్టల్‌కు వాటర్ కూలర్‌ను స్పాన్సర్ చేయండి .                         

 4.చేతన ఫౌండేషన్ USA పేద మరియు మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిణీ. 

 

                                        2022 నుండి 2023 వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు

1. 23-10-2022న కార్యనిర్వాహక సభ్యుల నుండి పాలకవర్గాన్ని ఎంపిక చేయడమైనది. అదేరోజు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఆడిట్ స్టేట్మెంట్స్ అనుమతి తీసుకోవడమైనది.

2 భవనాలకు పెయింటింగ్ వేయించడమైనది.

3. సమితి ఆవరణలో స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్ర దినోత్సవం వైభవంగా జరుపుకోవడమైనది.

4. 27-2-2023న అత్యాధునిక సదుపాయాలతో JKC కాలేజి రోడ్డులో నూతనంగా రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించబోయే భవన సముదాయానికి శ్రీ నూతక్కి రామక్రిష్ణ ప్రసాదు దంపతులచే ఉదయం 10:14 నిమిషాలకు భూమిపూజ చేయడమైనది. ఈ కార్యక్రమానికి శ్రీ చల్లా రాజేంద్రప్రసాద్, శ్రీ దండా బ్రహ్మానందం, MP సుజనా చౌదరి, మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్, MLA వసంతక్రిష్ణప్రసాద్, శ్రీ నంబూరు శంకర్రావు, శ్రీ చేబ్రోలు నరేంద్ర, శ్రీ కందిమళ్ళ శ్రీనివాసరావు, మాజీ MLC రాయపాటి శ్రీనివాస్, శ్రీ రావెళ్ళ సత్యనారాయణ, శ్రీ వై.వి. ఆంజనేయులు, శ్రీ భాష్యం రామకృష్ణ, శ్రీ జి.వి. ఆంజనేయులు, శ్రీ నాగళ్ళ రవీష్ తదితరులు పాల్గొన్నారు.