ఇతర అవసరాలకు మరో 10 కంప్యూటర్లు వాడుతున్నాము. ల్యాబ్లో ఈ క్రింద తెలియపరచిన 8 సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నవి.
(1) టర్బో ‘సి’ (2) జావ (3) పైథాన్ (4) ఆటో క్యాడ్ (5) ఫోటోషాపు (6) టైపింగ్ మాస్టర్ (7) రాపిడ్ టైపింగ్ (8) NPTEL Online Courses for B. Tech., MBA, Degree, B.Pharmacy (9) ఆన్లైన్ కోర్సులు.
పైన తెలిపిన సాఫ్ట్వేర్లు అన్ని కంప్యూటర్స్లో ఉన్నవి. విద్యార్థినులను తమ అవసరాల నిమిత్తం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు వీటిని ఉపయోగించుకోవచ్చును. ల్యాబ్లో జిరాక్స్, మెయిల్ ప్రింట్స్, స్కాన్స్, ఆన్లైను పరీక్షలు వ్రాయడానికి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోడానికి, ఉ పయోగించుకోవడానికి, ప్రాజెక్టు వర్కు చేయడానికి ఉపయోగించుకోవడానికి వీలుంటుంది.<
సెలవు దేవాలలో ఉదయం 10 గంల నుండి సాయంత్రం 9 గంటల వరకు విద్యార్థినులకు ల్యాబు ఉంటుంది. అందుబాటులో
విద్యార్థినుల సౌకర్యార్థం అతి తక్కువ ఫీజులతో ఈ క్రింద తెలియబరచిన కోర్సులను వసతి గృహము ఆవరణలోనే (1) C, C++, జాన్, ఫైనాన్, స్పోకెన్ ఇంగ్లీష్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, టైపింగ్, ఇంకా విద్యార్థినులు కోరిన యెడల వేరే క్లాసులు కూడా వసతి గృహము ఆవరణలో ఏర్పాటు చేయుటకు అవకాశము ఉన్నది.
కంప్యూటర్ ల్యాబ్లో 4 ప్రాజెక్టర్స్ కలవు. అందులో ఒకదానిని ఆడిటోరియంలో అమర్చి ప్రతి ఆదివారం విద్యార్థినులకు సినిమాలు ప్రదర్శించుచున్నాము. రెండవ ప్రాజెక్టరు విద్యా విషయాలకు ఉపయోగిస్తున్నాము. మూడవ, నాల్గవ ప్రాజెక్టర్ లను క్లాసులకు ఉపయోగిస్తున్నాము. లాప్టాప్ ఉన్న వారికి ఫ్రీగా సాఫ్ట్వేర్స్ అప్లోడ్ చేయబడును.
ఎం. ఎస్ ఆఫీస్, బేసిక్స్ (C. Cvr etc ) కోర్సులు ఫ్రీగా నేర్పించబడును, కంప్యూటరు సంబంధించి లాప్టాప్ ఆపరేషన్ చేయటానికి ఒక వారం తప్పనిసరిగా నేర్పించబడును.