KJSS Giving Scholarship for 2023

KJSS  ADMISSIONS

                              హాస్టల్ ప్రవేశ పద్ధతి

గుంటూరు నగరములో పరిసర కాలేజీలలో ప్రవేశము పొందిన గ్రామీణ ప్రాంత విద్యార్థినులు మాత్రమే ప్రవేశమునకు అర్హులు. గుంటూరు నగరానికి దగ్గరగా వున్న గ్రామముల నుండి వచ్చు విద్యార్థినులకు ప్రవేశము లేదు. అందుబాటులో ఉన్న 1400 సీట్లలో అన్ని కోర్సుల వారికి ప్రతిభ (మెరిట్) పద్ధతిలో ప్రవేశము కల్పించబడును. పూర్వ విద్యార్థినులకు 10 శాతం మార్కులు కలుపబడును.
దాతల సిఫారసు సీట్లు : 2 లక్షలు విరాళము ఇచ్చిన దాతలు సూచించిన విద్యార్థినికి 10 శాతం మార్కులు కలుపబడును. వారు ఫీజు మాత్రము అందరు విద్యార్థినులు లాగానే చెల్లించవలసియున్నది.

                                       క్రమశిక్షణ

విద్యార్థినుల వసతి గృహ నియమ నిబంధనలు ఉల్లంఘించిన యెడల ఫీజు రిఫండ్ చెయ్యకుండా. వసతి గృహము నుండి పంపించివేయబడుదురు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలకు నియమ నిబంధనలు. తెలియపరచి వాని కనుగుణంగా నడుచుకోమని కోరడమైనది.
వసతి గృహ ఆవరణలో విద్యార్థినులు అనుమతి లేకుండా సెల్ఫోను కలిగి యున్ననూ, ల్యాప్టాప్ ద్వారా ఫోను వాడుతూ పట్టుబడినచో వారు కట్టిన ఫీజు తిరిగి ఇవ్వబడదు. అటువంటి వారు వెంటనే పంపించి వేయబడుదురు. ఎటువంటి సిఫార్సులకు అవకాశం లేదు.

హాస్టల్ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేయబడును. ముఖ్యంగా హాస్టల్లో తీసుబందారాలు డైనింగ్ హాలు వరకే పరిమితం. బయట తినుబండారాలు అనుమతించబడవు. ఆహార పదార్థాలు వ్యర్ధం చేసే విషయంలో, సెల్ఫోన్ విషయంలో, రూములలో వస్తువులు పోయే విషయలోను, దొంగతంసం చేయుట, దానికి ప్రేరేపించుట జరిగినచో అట్టివారిని నిర్ధాక్షిణ్యముగా బయటకు పంపించి వేయుట జరుగును. క్రమశిక్షణ విషయంలో ఎటువంటి వత్తిళ్ళకు అవకాశం లేదు. హాస్టల్లో, క్లాసులలో, కాలేజీలో వచ్చిన టాపర్స్ కి మంచి గుర్తింపు ఇవ్వబడును (పారితోషికము కూడా ఇవ్వబడును Apr NCC, as well as social service). గత 20 సంవత్సరాల అనుభవంలో గ్రామీణ కమ్మ విద్యార్థినుల గృహంలో నూటికి నూరుశాతం మంచి నడవడికతో కమ్మజన సేవాసమితికి, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తూ మంచి ఫలితాలతో బాగా నీరుపుకుంటున్నారు. ఇదే సాంప్రదాయాన్ని విద్యార్థినులందరు. కొనసాగించాలి. వసతి గృహములో 100 శాతం విద్యార్థినులు మంచి నడవడికతో వారి దృష్టినంతా చదువు మీదే కేంద్రీకరించి మంచి మార్కులు తెచ్చుకొను చున్నారు. వసతి గృహ విద్యార్థినులు తమ స్నేహితురాళ్ళు, ఇతరులను ఎవ్వరిని గదులలోకి తీసికొని రాకూడదు.