KJSS Giving Scholarship for 2023

కమ్మ జన సేవా సమితికి స్వాగతం

 

 

                                                                                                                                                                                         కమ్మజన సేవాసమితి

                                                                                                       గ్రామీణ కమ్మ విద్యార్థినుల వసతి గృహములు

                                                            కొమ్మాలపాటి శ్రీధర్, మాధవిలత (ప్రధాన భూదాతలు) (N.H-5, ఈనాడు కార్యాలయం వెనుక భాగములో)

                                                                                                                   చల్లా రాజేంద్రప్రసాద్ నగర్

                                                                                                                          సుజనా ప్రాంగణము

                                                                                                     మండవ రమాదేవి, వెంకట్రామయ్య (జూనియర్స్)

                                                                                                       రావి రామకృష్ణయ్య మెమోరియల్ (సీనియర్స్)

                                                                                                    కావూరి సంపూర్ణమ్మ, వెంకట నారాయణ (టెక్నికల్)

                                                                                       కీ॥శే॥ కనకమ్మ గారి కుమారుడు  కందిమళ్ళ శ్రీనివాసరావు (టెక్నికల్)

                                                                                                                        డోర్ నెం. 14-4, వార్డు నెం. 3

                                                                                               బృందావన్ గార్డె  ఫోన్స్ : 91 863 2355471, 2260666 (ఆఫీస్)

                                                          Website: www.kammajanasevasamithi.com, www.kjss.in E-mail ka kjss@kjss.in Face book: Kamma KJSS    

                                                                           కమ్మజన సేవా సమితి

రాష్ట్రంలోనే విద్యకు ప్రధమ స్థానంలో ఉన్న గుంటూరు నందు బాలుర వసతి గృహము 1919 సంవత్సరము నుండి పెద్దలు, దాతల సహాయంతో పనిచేయుచున్నది. ప్రస్తుతం అరండల్ పేటలో ఉన్న ఈ హాస్టలులో చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకొన్నారు.

                                                        ఇదే ప్రేరణతో స్త్రీ విద్య ప్రాముఖ్యతను గుర్తించి జిల్లా మారుమూల గ్రామాల నుండి వచ్చిన విద్యార్థినుల వసతి గృహము అవసరమును గమనించి 23-4-1978 తేదీన కీ॥శే॥ వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారి అధ్యక్షతన ఆనాడు హాజరైన 215 మంది సభ్యులు విద్యార్థినుల వసతిగృహ నిర్మాణమునకు తీర్మానము చేసియున్నారు. 12-5-1978న మన సమితి మొదటి అధ్యక్షులు కీ॥శే॥ వలివేటి నరసింహారావు రిజిష్టరు చేసియున్నారు. తదుపరి ప్రస్తుతం వున్న ఎకరం స్థల సేకరణ చేసి లారీ యజమానుల సహకారంతో మెరక తోలియున్నారు. కీ॥ శే॥ డా॥ ముద్దన హనుమంతరావు, శ్రీ వాసిరెడ్డి రామారావు, కీ॥శే॥ గురజాల సాంబశివరావు (సెంట్రల్కేష్ పాంథియల్ శ్రీ కొత్తపల్లి రమేష్ క్రిష్ణ చంద్ర మే॥ కొర్రపాటి వెంకట నారాయణ యజమానుల సహకారంతో మెరక తోలియున్నారు. కీ॥ శే॥ డా॥ ముద్దన హనుమంతరావు, శ్రీ వాసిరెడ్డి రామారావు, కీ॥శే॥ గురజాల సాంబశివరావు (సెంట్రల్ కేఫ్ సాంబయ్య) శ్రీ కొత్తపల్లి రమేష్ క్రిష్ణ చంద్ర, కీ॥శే॥ కొర్రపాటి వెంకట నారాయణ, కీ॥శే॥ మోటూరు సత్యన్నారాయణ, కీ॥శే॥ పి.యల్. నారాయణ. అప్పటి పంచాయతీరాజ్ ఇ.ఇ. శ్రీ కుటుంబరావు, గత పాలక వర్గాలు సహాయ సహకారాలు అందించినారు.

                                 సుమారు 5 సం|| అధ్యక్షునిగా పనిచేసిన శ్రీ నాగళ్ళ చలపతిరావు స్థలము అన్యాక్రాంతము కాకుండా కాపాడినారు. కారణాంతరాల వలన ఆశించిన అభివృద్ధి జరుగలేదు. 1990 తరువాత స్థలమునకు ఇవ్వవలసిన దిగుబాటు పైకం చెల్లించి సొంతము చేసికొనియున్నాము.

                                           వసతి గృహముల వివరములు మరియు నియమ నిబంధనలు

సమితిచే గుంటూరు నగరం నడిబొడ్డున బృందావన్ గార్డెన్స్ నందు సువిశాలమైన ఒక ఎకరం స్థలంలో నడుపబడుచున్న (1) మండవ రమాదేవి, వెంకట్రామయ్య (జూనియర్స్), (2) రావి రామకృష్ణయ్య మెమోరియల్ (సీనియర్స్), (3) కావూరి సంపూర్ణమ్మ, వెంకట నారాయణ (టెక్నికల్), (4) కీ॥శే॥ కనకమ్మ గారి కుమారుడు కందిమళ్ళ శ్రీనివాసరావు (టెక్నికల్) వసతి గృహములలో ప్రవేశమునకు ముందు, మన సమితి గురించి మరియు నియమ నిబంధనల గురించి తప్పక తెలుసుకోవలసి వున్నది. దయచేసి విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కూడా ప్రవేశ దరఖాస్తు నింపే ముందు ఈ క్రింది విషయములు గమనించగలరు.

                                                                                  KJSS bus

 బస్సు కొనుగోలు నిమిత్తం ఇంతకుముందే గది నిర్మాణం కోసం విరాళము ఇచ్చిన మేడికొండూరు గ్రామమునకు చెందిన, వ్యాపార రీత్యా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో స్థిరపడిన శ్రీ నెలకుదుటి శ్రీ నరహరి ప్రసాద్, శ్రీమతి విజయలక్ష్మి, 2,50,000/- విరాళం ఇచ్చియున్నారు. బస్సు ఫీజు విద్యార్థినికి నెలకు రూ. 100/-లు చొప్పున విద్యాసంవత్సరము మొత్తమునకు రూ. 1,000/-లు ఒక్కసారిగా చెల్లించవలయును.

                                       కాట్రగడ్డ కమలాదేవి, లక్ష్మీనరసింహారావు కంప్యూటర్ నాలెడ్జ్ సెంటర్

నూతన వసతి గృహము మొదటి అంతస్తులో అవసరమైనన్ని కంప్యూటర్లతో, సర్వ హంగులతో కాట్రగడ్డ ఫౌండేషన్ వారి సౌజన్యంతో కంప్యూటర్ సెంటర్ నెలకొల్పబడినది. ఇచ్చట విద్యార్థినులకు కంప్యూటర్ విద్య నేర్పబడును.

                                                                                దోభీ ఖర్చులు

హాస్టల్ విద్యార్ధినులందరూ విద్యా సంవత్సరమునకు రూ.500 దోఖీ ఖర్చుల (వాషింగ్ మాత్రమే) చెల్లించవలసి యున్నది. హాస్టల్లో ఏ విధమైన బట్టలు ఉ తికే కార్యక్రమము అనుమతించబడదు.

                                                                                ఫోన్ సౌకర్యం

 వివిధ వసతి గృహములలో ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయబడినది. అయితే స్టడీ అవర్స్లో విద్యార్థినులకు అసౌకర్యం కలగకుండా ఉండుటకుగాను తల్లిదండ్రులకు నిర్ణీత సమయము నిర్ణయించడమైనది. అప్లికేషన్లో వున్న ఫోను నంబరు నుంచి తప్ప వేరే ఫోను నంబరు నుంచి వచ్చిన ఫోను కాల్స్ అంగీకరించబడవు. 60 పే ఫోన్లు ఏర్పాటు చేయబడినవి. కాని అవి కూడ నిర్ణీత సమయములోనే అని గమనించగలరు.

                                                     తల్లి దండ్రులు హాస్టలుకు వచ్చు సమయములు
  1. శనివారము సాయంత్రం 4 గం.ల నుండి 6 గం. ల మధ్య

2. ఆదివారం మరియు శలవు దినములలో ఉ. 9గం. నుండి సా. 6 గం. వరకు ఇతర రోజులలో విద్యార్థినులను చూచుటకు రాకూడదు. తప్పనిసరి పరిస్థితులలో ముందుగా వారైను అనుమతి తీసుకొనవలెను.

                                                                            మంచినీటి సౌకర్యం

హాస్టల్ విద్యార్థినులకు మంచినీటి సౌకర్యార్ధం సుమారు 50,000 వేల లీటర్లు సామర్ధ్యము గల సంప్ నిర్మించడమైనది. అందుకు నీరు సరఫరా చేయుటకు వాటర్ ట్యాంక్ కలదు. మినరల్ వాటర్ ప్లాంటు సౌకర్యము కలదు. పాలకవర్గ సభ్యులు శ్రీ మల్లెల హరేంద్రనాథ్ చౌదరి గారు బహూకరించిన మినరల్ వాటర్ ప్లాంట్ రెండోదానిని ఈ సంవత్సరము ప్రారంభించడమైనది. శ్రీ బొడ్డు నరసింహారావు గారు 100 లీటర్ల వాటర్ కూలర్ను వసతి గృహానికి బహూకరించారు.  

                                                                           డిజిటల్ గ్రంథాలయం

డిజిటల్ గ్రంథాలయం పూర్తిస్థాయి శీతలీకరణతో నెట్, కంప్యూటర్ క్లాసులు, ఆధునిక పుస్తకాలు, ఇంటర్ నుండి పి.జి. స్థాయి వరకు ఎవరు ఏ పుస్తకాలు కావాలన్నా వాటిని సమకూర్చుతూ ఇంగ్లీషు, తెలుగు దినపత్రికలతో పాటు నెలకు 100కు పైగా మాస, పక్ష పత్రికలతో విద్యార్థినులకు అత్యంత ఉపయోగకరంగా నెలకొల్పబడినది.

                                                                                కోచింగు ఏర్పాట్లు

కంప్యూటర్, ICET ఇంగ్లీషు లాంగ్వేజ్ తదితర కోర్సుల నిమిత్తము విద్యార్థినులెవ్వరూ బయట సెంటర్ లో చేరవద్దు, వారికి కావలసిన అన్ని కోచింగ్ సదుపాయములు హాస్టల్లోనే కల్పించబడును. అందువలన వ్యయము తగ్గటమే కాకుండా సమయము వృధా కాకుండా అరికట్టవచ్చును. బయట కోచింగ్ కావలసిన విద్యార్థినులు అచ్చట ఫీజు చెల్లించక ముందే హాస్టల్లో అనుమతి తీసుకోవలయును.

 కంప్యూటర్ క్లాసులు, స్పోకెన్ ఇంగ్లీషు, టైపు, కోచింగు క్లాసులు అతి తక్కువ ఫీజుతో కనీసం 10 మంది విద్యార్థినులు ఉన్నా క్లాసులు నిర్వహిస్తాము. విద్యార్థినులు బయటకు పోవలసిన అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయబడినవి.

                                                                      స్కాన్ కార్డులు / గుర్తింపుకార్డులు

విద్యార్థినులు బయటకు, కాలేజీలకు వెళ్ళి రావడానికి, ఇంటికి వెళ్ళి రావడానికి స్కాన్ / గుర్తింపు కార్డు ఏర్పాటు చేయడమైనది. దీని మూలంగా విద్యార్థిని ఎప్పుడు వెళ్ళిందీ వచ్చిందీ ఖచ్చితంగా చెప్పవచ్చును.

                                                                                         స్పోర్ట్స్

విద్యార్థినులందరికీ కావలసిన ఇండోర్ గేమ్స్, ఆటవస్తువులు అందుబాటులో ఉంచడమైనది. వార్షికోత్సవానికి ముందు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయుచున్నాము.

                                                                                   వైద్య సౌకర్యం

ఆరోగ్య పరిరక్షణకు కావలసిన కనీస మందులు ఉచితంగా అందుబాటులో ఉంచడమైనది. అత్యవసరమైతే విద్యార్థినులను కారులో హాస్పటల్కు తీసుకు వెళ్ళుచున్నాము.

                                                                                  సి.సి. కెమెరాలు

వసతి గృహ ఆవరణలో 16 సి.సి. కెమేరాలతో విద్యార్థినుల ప్రవర్తన కార్యాలయంలో మానిటర్ ద్వారా పర్యవేక్షించబడును.

                               శ్రీమతి మల్లెల విజయలక్ష్మి (కొల్లిపర) భర్త శ్రీ కృష్ణ ప్రసాద్ గారి వ్యాయామ శాల

వసతి గృహము లోని విద్యార్థినులకు కావలసిన వ్యాయామం కొరకు శ్రీమతి మల్లెల విజయలక్ష్మి (కొల్లిపర) భర్త శ్రీ కృష్ణ ప్రసాద్ గారిచ్చిన రూ. 10 లక్షల ఆర్ధిక సహాయంతో జూనియర్ బ్లాకులోని నాలుగవ అంతస్తులో ఆధునిక వసతులతో కూడిన వ్యాయామశాల ఏర్పాటు చేయడమైనది. అదనంగా రూ.10 లక్షలు దాతల సహయంతో ఆధునిక పరికరాలు సమకూర్చుతున్నాము.

                                                                                          క్రమశిక్షణ

విద్యార్థినుల వసతి గృహ నియమ నిబంధనలు ఉల్లంఘించిన యెడల ఫీజు రిఫండ్ చెయ్యకుండా వసతి గృహము నుండి పంపించివేయబడుదురు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలకు నియమ నిబంధనలు తెలియపరచి వాని కనుగుణంగా నడుచుకోమని కోరడమైనది.

                      వసతి గృహ ఆవరణలో విద్యార్థినులు సెల్ఫోన్ను కలిగి యున్ననూ, ల్యాప్టాప్ ద్వారా ఫోను వాడుతూ పట్టుబడినచో వారు కట్టిన ఫీజు తిరిగి ఇవ్వబడదు. అటువంటి వారు వెంటనే పంపించి వేయబడుదురు. ఎటువంటి సిఫార్సులకు అవకాశం లేదు.

                      హాస్టల్ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేయబడును. ముఖ్యంగా హాస్టల్లో తినుబండారాలు డైనింగ్ హాలు వరకే పరిమితం. బయట తినుబండారాలు అనుమతించబడవు. ఆహారపదార్థాలు వ్యర్థం చేసే విషయంలో, సెల్ ఫోన్ విషయంలో, రూములలో వస్తువులు పోయే విషయంలోను, దొంగతనం చేయుట, దానికి ప్రేరేపించుట జరిగినచో అట్టివారిని నిర్దాక్షిణ్యముగా బయటకు పంపించి వేయుట జరుగును.

 

                       క్రమశిక్షణ విషయంలో ఎటువంటి వత్తిళ్ళకు అవకాశం లేదు. గత 15 సంవత్సరాల అనుభవంలో గ్రామీణ కమ్మ విద్యార్థినుల గృహంలో నూటికి నూరుశాతం మంచి నడవడికతో కమ్మజన సేవాసమితికి, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తూ.. మంచి ఫలితాలతో బాగా చదువుకుంటున్నారు. ఇదే సాంప్రదాయాన్ని విద్యార్థినులందరు కొనసాగించాలి. వసతి గృహములో 100% విద్యార్థినులు మంచి నడవడికతో వారి దృష్టినంతా చదువు మీదే కేంద్రీకరించి మంచి మార్కులు తెచ్చుకొనుచున్నారు. వసతి గృహ విద్యార్థినులు తమ స్నేహితురాళ్ళు, ఇతరులను ఎవ్వరిని గదులలోకి తీసికొని రాకూడదు.

                                                                                   హాస్టల్ ప్రవేశ పద్ధతి

గుంటూరు నగరములో పరిసర కాలేజీలలో ప్రవేశము పొందిన గ్రామీణ ప్రాంత విద్యార్థినులు మాత్రమే ప్రవేశమునకు అర్హులు. గుంటూరు నగరానికి దగ్గరగా వున్న గ్రామముల నుండి వచ్చు విద్యార్థినులకు ప్రవేశము లేదు. అందుబాటులో ఉన్న 1400 సీట్లలో అన్ని కోర్సుల వారికి ప్రతిభ (మెరిట్) పద్ధతిలో ప్రవేశము కల్పించబడును. పూర్వ విద్యార్థినులకు 10% మార్కులు కలుపబడును.

దాతల సిఫారసు సీట్లు : 2 లక్షలు విరాళము ఇచ్చిన దాతలు సూచించిన విద్యార్థినికి 10% మార్కులు కలుపబడును. వారు ఫీజు మాత్రము అందరు విద్యార్థినులు లాగానే చెల్లించవలసియున్నది.

                                                                                      ఆర్థిక సహాయము

ఆర్థిక సహాయం లేకపోతే చదువు ఆగిపోతుంది అనుకునే పేద విద్యార్థినులు ఆర్థిక సహాయము నిమిత్తము తమ అవసరములు వివరించి దరఖాస్తు చేసుకోవలెను. అట్టి దరఖాస్తుల నుండి కమిటీ వారు ప్రత్యేకంగా విచారించి తగు ఆర్థిక సహాయము రూ.5,000/-లు వరకు చేయు అవకాశం కలదు. తల్లి/తండ్రి/ఇద్దరూ లేని ప్రతిభ గల నిరుపేద బాలికలకు హాస్టలు ఫీజు మొత్తము చెల్లించు దాతలు ఉన్నారు. తండ్రి/ తల్లి లేని ప్రతిభ గల పేద విద్యార్థినులు హాస్టలు ఆఫీసులో పేరు నమోదు చేయించుకో వలెను. వారి ప్రతిభ ఆధారముగా ఆర్థిక సహాయము చేయబడును. దాతలు ప్రతి సంవత్సరము వారి ట్రస్టు ద్వారా మన విద్యార్థినులకు ఆర్థిక సహాయము చేయుచున్నారు. ఉపకార వేతనములు హాస్టలులో ఏర్పాటు చేసిన కోచింగ్ క్లాసులకు హాజరు అయిన వారికి మాత్రమే ఇవ్వబడును.

                                                                                      ఫీజు వివరములు

1.  వసతి గది నిర్వహణ ఛార్జీలు సం||నకు రూ. 21,500/- నుండి రూ.24,000/- జూన్ 1 నుండి మార్చి 31 వరకు విద్యాసంవత్సరంగా పరిగణించబడును. హాస్టల్ ఫీజు విషయంలో రోజువారీ చెల్లింపు / లెక్కింపు అనుమతించబడదు.

2.  కౌన్సెలింగ్ ద్వారా వచ్చినవారు చేరిన నెల నుండి లెక్కించి ఏప్రిల్, మే నెలలలో ఫీజు సర్దుబాటు చేయబడును.

3.  సెప్టెంబరు మాసం నుండి తదుపరి మాసాలలో ఏ నెలలో చేరినా ఆయా మాసాల నుండి మార్చి 31 వరకు లెక్కించి అన్ని మాసములకు ఫీజు కట్టించుకొనబడును..

4.  అనివార్య కారణముల వలన బయటకు వెళ్ళే వారికి నిర్వహణ చార్జీల క్రింద ఒక నెల తగ్గించి మిగతా మాసాలకు ఫీజు తిరిగి ఇవ్వబడును.

5.  కౌన్సిలింగ్ ద్వారా చేరేవారు ముందుగా ఫీజు చెల్లించి వారికి గుంటూరు -పరిసరాలలో సీటు రాక వేరే ప్రాంతాలలో చేరాల్సి వస్తే వారికి వారు చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి ఇవ్వబడును.

6.  ఏప్రిల్, మే మాసాలలో అదనంగా ఉండవలసినచో జూనియర్, సీనియర్ బ్లాకులలో నెలకు రూ. 2,200/- చొప్పున అదనంగా చెల్లించవలసి వుంటుంది. అలాగే శ్రీ కందిమళ్ళ శ్రీనివాసరావు భవనంలో ఏప్రిల్, మే నెలలో అదనంగా వుండవలసినచో నెలకు రూ.2,400/- చొప్పున చెల్లించవలసి వుంటుంది.

                                                వసతి గృహంలో విద్యార్థినులు పాటించవలసిన నియమాలు

1. వసతి గృహం ఆవరణలో సెల్ ఫోన్, మొబైల్ కలిగి ఉండరాదు.

2. ల్యాప్టాప్లు ఉపయోగించరాదు. ఇంజనీరింగ్ 3/4 సంవత్సరం చదివేవాళ్లు యాజమాన్య అనుమతి తీసుకొని మాత్రమే వాడవచ్చును. ల్యాప్టాప్లను విద్యా సంబంధ విషయాలకు మాత్రమే ఉపయోగించాలి. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోరాదు. ఫేస్ బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న అనర్థాలపట్ల అప్రమత్తులుగా ఉండాలి.

3.కాలేజి బస్సులో మాత్రమే తమ ప్రయాణాలు చేయాలి. బస్సు వెళ్లిన తరువాత వస్తే కాలేజికి ఆరోజు పంపడం జరగదు కనుక ఐదు నిమిషాలు ముందుగానే వచ్చి నిరీక్షించాలి. ఆటో / సిటీ బస్సు ప్రయాణాలు అనర్థదాయ.

4.అపరిచితులతో పరిచయాలు ప్రమాదకరాలు కావచ్చు. వాటిపై కాలేజీకి వెళ్లటంక్షేమం కాదు.

5.మహిళలపై అనేక రకాల హింసలు పెరుగుతున్నందున మునుపటి కంటే అప్రమత్తంగా ఉండటం అవసరం.

6.మీ ఈమెయిల్ / ఫేస్బుక్ చిరునామాలు వంటి సమాచారం ఇతరులకు అందనివ్వకండి. మీ ఉద్దేశాలు మంచివి, మీరు నిప్పులాంటి వారే అయినా అందరూ అలా కాకపోవచ్చు.

                                      వసతి గృహములో చేరు సమయములో విద్యార్థిని చెల్లించవలసిన ఫీజు

                        (i) వసతి గది, నిర్వహణ ఖర్చులు               :    21,000

                        (ii) దోభీ చార్జీలు                                             :         500

                        మొత్తము                                                 రూ.     21,500

                        కీ॥శే॥ కందిమళ్ళ కనకమ్మ గారి కుమారుడు శ్రీనివాసరావు వసతి గృహములో చేరు
                                                   సమయంలో విద్యార్థిని చెల్లించవలసిన ఫీజు

                        (i) రూము & ఎస్టాబ్లిష్ మెంట్ చార్జీలు         :    23,500

                        (ii) దోభీ చార్జీలు                                             :         500

                         మొత్తము                                                రూ.     24,000

                        (ii) బస్ సౌకర్యం – రూ.1,000 (సం॥నకు)

        (జె.కె.సి. కాలేజి విద్యార్థినులకు బస్ సౌకర్యం కలదు. వీరికి మాత్రమే వర్తిస్తుంది)

                                                                    దినచర్య మరియు భోజన వసతి

1. విద్యార్థినులందరు ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి.

2. అల్పాహారము               : ఉదయం గం. 6.30 ని.ల నుండి 8.00 గం.ల వరకు

3. మధ్యాహ్న భోజనం       : మధ్యాహ్నం గం. 12.30 ని.ల నుండి 2.00 గం.ల వరకు సాయంత్రం గం. 4.30 ని.ల నుండి 6.00 గం.ల వరకు

4. అల్పాహారము                : సాయంత్రం గం. 4.30ని.ల నుండి 6.00 గం.ల వరకు

5. చదువుకొను సమయం  : సాయంత్రం 6.00 గం.ల నుండి 7.30 ని.ల వరకు

6. రాత్రి భోజనం                 : రాత్రి గం. 7.30ని.ల నుండి 8.30ని.ల వరకు(అంతస్తు వారీగా 20 ని. లు మాత్రమే)

7. చదువుకొను సమయం  : రాత్రి గం. 8.30 ని.ల నుండి 10.00 గం.ల వరకు

8. నిశ్శబ్దకాలము (గదులలో) రాత్రి గం. 8.30 ని.ల నుండి ఉదయం 8.00 గం.ల వరకు

            పరిశుభ్రమైన పౌష్టికాహారము, పాలు, పెరుగు, గుడ్లు, మాంసాహారం, తాజా కూరగాయలతో కూడిన పుష్టికరమైన సంపూర్ణమైన ఆహారము యివ్వబడుచున్నది. పరిశు భ్రమైన, శుద్ధిచేసిన చల్లని నీరు ఇవ్వబడును.

            వారములో ఒక రోజు గుడ్లు, ఒక రోజు మాంసాహారము, పెరుగు రెండు పూటలా ఇవ్వబడును. విద్యార్థినులకు రెండు పూటలా అల్పాహారముతో పాలు ఇవ్వబడును.

             వస్తువులు : హాస్టలు రూములో కిటికీలకు దోమతెరలు, మంచము, పరుపు, వగైరాలు కల్పించబడినవి. దిండు, దుప్పట్లు, ప్లేటు, గ్లాస్, బకెట్, తాళము, రీడింగు కుర్చీ, రైటింగ్ పాడ్ విద్యార్థినులు తెచ్చుకొనవలెను.