1.విద్యార్దునులు కాలేజీకి వెళ్లి వచ్చు సమయములు తప్ప వసతి గృహములు వదిలి బయటికి వెళ్ళు కాలము వచ్చు కాలమునకు వార్డెన్ అనుమతి కావలయును. ఎట్టి పరిస్థితులలోను రాత్రి 8 గంటలలోపు వసతి గృహమునకు రావలయును. రాత్రి 8 గంటల తరువాత ఏ విధమైన కోచింగ్ క్లాసులకు అనుమతించబడదు .
2.విలువైన ఆభరణములను వసతి గృహములో ధరించకూడదు. రూ.250 మించిన డబ్బు దగ్గర ఉండకూడదు. అంతకంటే ఎక్కువ డబ్బు ఉన్నయెడల వార్డెనికి ఇచ్చి రశీదు పొందగలరు. వారికి అవసరమైనప్పుడు డ్రా చేసుకొనవచ్చును.
3.సెల్ ఫోన్లు, టేప్ రికాడర్లు, రేడియోలు ఏవిధమైన ఎలక్ట్రానిక్ పరికరములు అనుమతించబడవు. ఒక విద్యార్థిని సెల్ ఫోన్ కలిగి ఉన్నచో ఆ విద్యార్థిని గదిలోని తోటి విద్యార్థినులు ఆ విషయమును వార్డెన్ దృష్టికి తీసుకొని రావలెను. అలా చేయకుండా ఉండుట ఆ గదిలోని విద్యార్థినులందరు బాధ్యత వహించవలెను. ఒకవేళ ఏ విద్యార్థిని వద్దనైనా వసతి గృహములో సెల్ ఫోన్ ఉన్నచో ఆ విద్యార్థినిని నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపివేయును. ఫీజు తిరిగి ఇవ్వబడదు. సెల్ ఫోన్ కూడా తిరిగి ఇవ్వబడదు.
4.తల్లిదండ్రులను శనివారం సాయంత్రం 4 గం. ల నుండి 6 గంటలు మరియు ఆదివారము ఉదయం 7 గం. ల నుండి సాయంత్రం 6 గం. ల మధ్య మాత్రమే అనుమతించబడును.
5.తల్లిదండ్రులను, బంధువులు, స్నేహితులు వసతి గృహములో ఉండుటకు అనుమతించబడరు.
6.విద్యార్దునులు హాస్టల్ బయట చేయు కార్యక్రమములతో హాస్టల్ వారికీ బాధ్యత లేదు. అట్టి విద్యార్థిని అభ్యంతరకర ప్రవర్తన విషయములు మేనేజుమెంటు దృష్టికి వచ్చిన యెడల విద్యార్థినిని హాస్టల్ నుండి పంపించి వేయడము జరుగుతుంది. విద్యార్థినులు హాస్టల్ నుండి ఇంటికి, ఇంటి నుండి హాస్టల్ కు వెళ్ళునపుడు తోడుగా తల్లిదండ్రులు తప్పక రావలయును. అలా రాని విద్యార్థినులకు జరుగు కష్టనష్టములకు హాస్టల్ వారి బాధ్యత లేదు.
7.మీ కోసము వచ్చే సందర్శకుల వివరములు వారి ఫోటోలు కూడా (తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో) కూడా తప్పనిసరిగా జత చేయవలసియున్నది. అట్టి వారిని మాత్రమే సందర్శకులుగా అనుమతించబడును. వీలయినంత వరకు తల్లిదండ్రులు మాత్రమే సందర్శకులుగా రాయండి. సోదరులను వ్రాయకండి. సోదరులు అనుమతించబడరు. ఫోటోకార్డు ఉన్నవారు మాత్రమే హాస్టలు విద్యార్థినులను కలుసుకొనుటకు అనుమతించబడును.
8.డైనింగు హాలు నుండి ఏ విధమైన తినుబండారాలు రూములలోకి తీసుకువెళ్లరాదు.
9.విద్యార్థినుల సదుపాయం కోసం అన్ని వస్తువులతో మరియు నోట్ పుస్తకాలతో వసతి గృహము ఆవరణలోనే స్పోర్ట్స్ ఏర్పాటు చేయటమైనది. కావున వివిధ కారణములు చూపి విద్యార్థినులు బయటకు వెళ్ళుటకు అనుమతించబడదు.
10.నిర్ణీత కాలేజి సమయములలో తప్ప విద్యార్థినులు బయటకు గాని, ఇళ్లకు గాని వార్డెన్ గారి వ్రాతపూర్వక అనుమతి తీసుకొని వెళ్ళవలసి యున్నది. అనుమతి లేకుండా వెళ్ళినచో తీవ్రమైన విషయంగా భావించి అట్టి విద్యార్థినులను హాస్టల్ నుండి పంపివేయబడును.
11.వసతి గృహములో మిగతా విద్యార్థినులతో కలసిమెలసి ఉండవలెను.
12.వసతి గృహములోని పరికరములు నష్టం కలుగచేయకూడదు. అట్టి నష్టం కలిగించిన వసతి గృహము యొక్క ఆస్తి విలువను విద్యార్థిని నుండి వసూలు చేయబడును .
13.వసతి గృహములోని గదులను మరియు వసతి పరిసరాలను శుభ్రముగా ఉంచవలెను.
14.వసతి గృహములలో గాని, వెలుపలగాని, సత్ప్రవర్తన కలిగి ఉండవలయును.
15.ఏవిధమైన తేడాలు లేకుండా హాస్టల్ విద్యార్థినులందరూ ఒకే విధమైన సదుపాయములు పొందగలరు.
16.బస్సు సౌకర్యం వినియోగించుకొను జె.కే.సి. కాలేజి విద్యార్థినులు అప్లికేషన్లతో ఫొటోతో పాటు విడిగా మరి ఒక ఫోటో జత చేయవలసి యున్నది. ఆ ఫోటోను విధ్యార్ధినిక ఐడెంటిటీ కార్డు ఇచ్చుటకు వాడబడును.
17.వసతి గృహములోని ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థినులందరూ వారి రూముల నుండి గ్రౌండ్ ఫ్లోర్ నందు రీడింగ్ హాల్ కు వచ్చి స్టడీ అవర్స్ లో విధిగా పాల్గొనవలెను.
18.హాస్టల్ విద్యార్థినులు నీరు, కరెంటు వాడకం విషయంలో పొదుపుగా ఉండవలెను. ఆహార పదార్ధాలు వృధా చేయరాదు.
19.రూము పరిశుబ్రముగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఆ రూములోని విధ్యార్ధినులదే.
20.డైనింగ్ హాలు, వాష్ బేసిన్ మరియు టాయిలెట్ వాడుక విషయంలో విద్యార్థినులందరు శుభ్రత పాటించవలసి యున్నది.
21.ఐడెంటిటీ కార్డు ఏర్పాటు చేయటమైనది.
22.తల్లిదండ్రుల సమావేశానికి తప్పనిసరిగా తల్లిదండ్రులు హాజరై రిజిష్టరులో వారి సంతకం నమోదు చేయవలెను. అట్లు హాజరు కానియెడల ప్రతిసారి తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకు వెళ్లవలెను . అట్లు రానివారి పిల్లలను ఇంటికి మరియు బయటకు వెళ్ళుటకు పర్మిషన్ ఇవ్వబడదు. పైన పేర్కొన్న నియమ నిబంధనలన్ని తల్లిదండ్రులు / సంరక్షకులైన మేము మరియు మా అమ్మాయి పూర్తి సమ్మతముతో ఒప్పుకొనుచున్నాము. పై నిబంధనలు అతిక్రమించినచో కమిటి వారు తీసుకోను నిర్ణయములకు బద్ధులము.
23.Spoken English, Computer Training Classes వసతి గృహములో ఏర్పాటు చేయబడును. కావున విద్యార్థినులందరూ దీనిని తప్పనిసరిగా వినియోగించుకోవాలి .ఈ క్లాసులకు హాజరైన వారికి ఉపకారవేతనములలో ప్రాధాన్యత ఇవ్వబడును
24.డైనింగ్ హాలుకు ఉదయం టిఫిన్ కు ఉదయం 6.30-8.30 గం. ల మధ్య, మధ్యాహ్న భోజనం పగలు 12.30-2.00 గం. ల మధ్య అలాగే రాత్రి భోజనం 7.00-8.30 గం. ల మధ్య పూర్తి చేసుకోవాలి.
We agreed all the terms and Conditions of KJSS.