About Us
విద్యార్థినులకు నియమ నిబంధనలు
1:- 2023 – 24 విద్యాసంవత్సరం వసతి గృహంలో జులై 1వ తేది నుండి ప్రారంభించబడును.
2:- ఫీజు మొత్తము 23-24 విద్యాసంవత్సరానికి ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది.
3:- ఈ విధముగా అయినచో
DR న్యూ బ్లాక్ లో + GST తో కలుపుకొని 10 మాసాలకు అసలు రూ.28,000/- + GST 2170/- మొత్తము = రూ.30,170/-
UB సీనియర్ బ్లాక్, జూనియర్ బ్లాక్ లో + GSTతో కలుపుకొని 10 మాసాలకు అసలు రూ.26,000/- + 1930/- మొత్తం = రూ.27,930/-
ER జెకెసి కాలేజి వారికి బస్సు ఫీజు కలుపుకొని 10 మాసాలకు అసలు రూ.28,000/- + GST రూ.2170/- మొత్తం రూ.30,170/-,
4:- ఎవరైనా మధ్యలో వసతి గృహం ఖాళీ చేసి వెళ్ళవలసి వచ్చినచో ఒక నెల ఫీజు పరిపాలన ఖర్చుల క్రింద మినహాయించుకొని మిగతా ఫీజు తిరిగి ఇవ్వబడును.
5:- చెల్లించే ఫీజులు విద్యార్థినుల విద్యా సంవత్సరం కొనసాగించుటకు మాత్రమే లెక్కించబడును. విద్యా సంవత్సరము అయిపోయిన తరువాత విద్యార్థినులు EAMCET, ICET, ECET, CRE, TOFEL, GRE, GATE మొదలగు క్లాసులకు వెళ్ళవలసి వచ్చినచో వాటికి నెలవారీ ఫీజు చెల్లించి ఉండవలెను.
6:- కాలేజి వారు అవసరమని చెప్పిన యెడల విద్యార్థినులకు సెల్ఫోన్ అనుమతించబడును. కానీ వారి వారి కాలేజీ అవసరాలకు మాత్రమే ఫోన్ వాడవలెయును. ఫోన్ మిస్ యూజ్ చేసినచో ఫీజు రిఫండ్ ఇవ్వకుండా వసతి గృహం ఖాళీ చేసి వెళ్ళవలెను.
7:- విద్యార్థినులు తాము బయట నుండి తినుబండారాలు తీసుకొని రావలదు. తమ ఇంటి వద్ద నుండి వండిన వాటిని తెచ్చుకొనవచ్చును. అలాగే పండ్లు, రసాలు తెచ్చుకొనవచ్చును.
8:- వసతి గృహంలో ఫీజు చెల్లించి మొదటి సంవత్సరం చేరే విద్యార్థులకు గుంటూరు పరిసర ప్రాంతాలలో కాలేజీ సీటు రాని పక్షంలో, అసలు వసతి గృహంలో చేరకుండా ఉన్నచో వారి ఫీజు మొత్తాన్ని జియస్టి మినహాయించుకొని ఇవ్వబడును
9:- విద్యార్థినులు గృహాలకు వెళ్ళేటప్పుడు వారు ఉపాధ్యక్షులు శ్రీ మల్లెల హరేంద్రనాథ్ చౌదరి, శ్రీ వడ్లమూడి నాగేంద్రం, పాలకవర్గ సభ్యులు శ్రీ వడ్లమూడి శివరామక్రిష్ణ మరియు శ్రీ పెద్ది సాంబశివరావు
గార్లతో ఎవరు అందుబాటులో ఉంటే వారి నుండి మాత్రమే పర్మిషన్ తీసుకొనవలెయును. వీరి నలుగురిలో ఎవరూ అందుబాటులో లేనప్పుడు మేనేజరు చావా బోసు నుండి మాత్రమే హోమ్ పర్మీషన్ పొందవలయును. వీరు మినహాయించి వేరేవ్వరి దగ్గరికి వెళ్ళి హోమ్ పర్మీషన్స్ అడగరాదు.
10:- కోచింగ్ సెంటర్స్కి అనుమతులు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాలేజీ పర్మిషన్స్ మొదలగు వాటికి అధ్యక్ష, కార్యదర్శులలో ఎవరు అందుబాటులో ఉంటే వారి నుండి మాత్రమే అనుమతి పొందవలయును.
11:- మీ ఫోన్లు, ల్యాప్టాప్లను మీరే భద్రపరుచోవలయును. వాటిని పోగుట్టుకున్నచో పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. ఫోన్లు రాత్రి 10 గంటలకు వార్డెన్స్ వద్ద డిపాజిట్ చేయవలయును.
12:- కోవిడ్-19 నిబంధనలు ఎల్లవేళలా పాటించవలయును. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం. దూరం పాటించడం చేయాలి. కొనిడ్ పూర్తిగా పోయినట్లుగా భావించరాదు..
13:- మీరు దరఖాస్తులో పొందుపరచిన ఫోన్ నెంబరు నుండి మాత్రమే సంబంధిత వార్డెను ఫోను చేసి హోమ్. పర్మిషన్ అడగవలెను.
14:- అమ్మాయిని చూడటానికి వచ్చే వారి ఫోటోలు నిబంధనల పేపరు పైభాగములో అంటించవలెను. వారు అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య, తాత, అమ్మమ్మ ఎవరయినా ఇద్దరివి మాత్రమే అంటించవలెను. వారిని మాత్రమే హాస్టల్కు అనుమతించబడుదురు.
15:- అమ్మాయిని చూడటానికి ఎల్లవేళలా రావలదు. శని, ఆదివారాలు (లేదా) పబ్లిక్ సెలవు ప్రకటించిన రోజున ఎప్పుడయినా రావచ్చు.
16:- అమ్మాయిని వీలయినంత వరకు పైన ఫోటోలో పేర్కొన్న ఎవరయినా ఒకరు వచ్చి తీసికెళ్లవలయును. వసతి గృహానికి కూడా తీసికొచ్చి వదలి పెట్టవలయును.
17:- వసతి గృహం విద్యార్థునులు తమ స్నేహితురాళ్ళను, తల్లిదండ్రులను ఎవ్వరిని గదులలోకి తీసుకొని రాకూడదు.
18:- ల్యాప్టాప్లు వాడేవారు పాలకవర్గమువారి అనుమతిపొంది కార్యాలయములో రిజిస్టర్ చేయించుకొనవలెను.
19:- వివాహము అయిన వారికి వసతి గృహములో ప్రవేశము లేదు.
20:- అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు వసతి గృహము నుండి తెచ్చిన పర్మీషన్ స్లిప్ను తనిఖీచేసి సమయానికి ఇంటికి చేరినదా లేదా పరిశీలించుకొని, వసతి గృహమునకు బయలుదేరేటప్పుడు కూడా ఆ స్లిప్ పై సంతకము చేసి సమయము, తేదీ పొందుపరచవలయును.
దినచర్య మరియు భోజన వసతి
1. విద్యార్థినులందరు ఉదయం 5 గంలకు నిద్ర లేవాలి.
2. అల్పాహారము : ఉదయం గం. 6.30 ని.ల నుండి 8.00 గం.ల వరకు
3. మధ్యాహ్న భోజనం : మధ్యాహ్నం గం. 12.30 ని. లనుండి 2.00 గం. లవరకు
4. అల్పాహారము : సాయంత్రం 4.30 గం.ల నుండి 6.00 గం.ల వరకు
5. చదువుకొను సమయం : సాయంత్రం 6.00 గంల నుండి రాత్రి 7.30 ని. ల వరకు
6. రాత్రి భోజనం : రాత్రి గం. 7.30 ని.ల నుండి 8.30 ని.ల వరకు (అంతస్తు వారీగా 20 ని.లు మాత్రమే)
7. చదువుకొను సమయం: రాత్రి గం. 8.30 ని.ల నుండి 10.00 గం.ల వరకు
8. నిశ్శబ్దకాలము (గదులలో) : రాత్రి గం. 8.30 ని.ల నుండి ఉదయం 8.00 గం.ల వరకు
పరిశుభ్రమైన పౌష్టికాహారము, పాలు, పెరుగు, గుడ్లు, మాంసాహారం, తాజా కూరగాయలతో కూడిన పుష్టికరమైన సంపూర్ణ ఆహారము యివ్వబడుచున్నది. పరిశుభ్రమైన, శుద్ధి చేసిన చల్లని నీరు ఇవ్వబడును.
వారములో రెండు రోజులు గుడ్లు, ఒకరోజు మాంసాహారము, పెరుగు రెండు పూటలా ఇవ్వబడును. విద్యార్థినులకు రెండు పూటలా అల్పాహారముతో పాలు ఇవ్వబడును.
వస్తువులు : హాస్టలు రూములో కిటికీలకు దోమతెరలు, మంచము, పరుపు, వగైరాలు కల్పించబడినవి. దిండు, దుప్పట్లు, ప్లేటు, గ్లాస్, బకెట్, తాళము, రీడింగ్ కుర్చీ, రైటింగ్ పాడ్ విద్యార్థినులు తెచ్చుకొనవలెను.