కమ్మజన సేవా సమితి

రాష్ట్రంలోనే విద్యకు ప్రధమ స్థానంలో ఉన్న గుంటూరు నందు బాలుర వసతి గృహము 1919 సంవత్సరము నుండి పెద్దలు, దాతల సహాయంతో పనిచేయుచున్నది. ప్రస్తుతం అరండల్ పేటలో ఉన్న ఈ హాస్టలులో చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకొన్నారు.

 

                            ఇదే ప్రేరణతో స్త్రీ విద్య ప్రాముఖ్యతను గుర్తించి జిల్లా మారుమూల గ్రామాల నుండి వచ్చిన విద్యార్థినుల వసతి గృహము అవసరమును గమనించి 23-4-1978 తేదీన కీ॥శే॥ వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారి అధ్యక్షతన ఆనాడు హాజరైన 215 మంది సభ్యులు విద్యార్థినుల వసతిగృహ నిర్మాణమునకు తీర్మానము చేసియున్నారు. 12-5-1978న మన సమితి మొదటి అధ్యక్షులు కీ॥శే॥ వలివేటి నరసింహారావు రిజిష్టరు చేసియున్నారు. తదుపరి ప్రస్తుతం వున్న ఎకరం స్థల సేకరణ చేసి లారీ యజమానుల సహకారంతో మెరక తోలియున్నారు. కీ॥ శే॥ డా॥ ముద్దన హనుమంతరావు, శ్రీ వాసిరెడ్డి రామారావు, కీ॥శే॥ గురజాల సాంబశివరావు (సెంట్రల్కేష్ పాంథియల్ శ్రీ కొత్తపల్లి రమేష్ క్రిష్ణ చంద్ర మే॥ కొర్రపాటి వెంకట నారాయణ యజమానుల సహకారంతో మెరక తోలియున్నారు. కీ॥ శే॥

డా॥ ముద్దన హనుమంతరావు, శ్రీ వాసిరెడ్డి రామారావు, కీ॥శే॥ గురజాల సాంబశివరావు (సెంట్రల్కేష్ పాంథియల్ శ్రీ కొత్తపల్లి రమేష్ క్రిష్ణ చంద్ర మే॥ కొర్రపాటి వెంకట నారాయణ యజమానుల సహకారంతో మెరక తోలియున్నారు. కీ॥ శే॥ డా॥ ముద్దన హనుమంతరావు, శ్రీ వాసిరెడ్డి రామారావు, కీ॥శే॥ గురజాల సాంబశివరావు (సెంట్రల్ కేఫ్ సాంబయ్య) శ్రీ కొత్తపల్లి రమేష్ క్రిష్ణ చంద్ర, కీ॥శే॥ కొర్రపాటి వెంకట నారాయణ, కీ॥శే॥ మోటూరు సత్యన్నారాయణ, కీ॥శే॥ పి.యల్. నారాయణ. అప్పటి పంచాయతీరాజ్ ఇ.ఇ. శ్రీ కుటుంబరావు, గత పాలక వర్గాలు సహాయ సహకారాలు అందించినారు.

          సుమారు 5 సం|| అధ్యక్షునిగా పనిచేసిన శ్రీ నాగళ్ళ చలపతిరావు స్థలము అన్యాక్రాంతము కాకుండా కాపాడినారు. కారణాంతరాల వలన ఆశించిన అభివృద్ధి జరుగలేదు. 1990 తరువాత స్థలమునకు ఇవ్వవలసిన దిగుబాటు పైకం చెల్లించి సొంతము చేసికొనియున్నాము.